ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి : ఉత్తమ్

by Shyam |
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి : ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగాలంటే.. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. శనివారం టీపీసీసీ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి పేదలకు పనులు కల్పించారన్నారు. వారి పని తీరుతో రాష్ట్రానికి ఉపాధి హామీ పనుల విషయంలో అవార్డులు కూడా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం లక్ష్యం సాధించని ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయరన్నఆందోళనలతో వారు సమ్మెకు దిగాల్సివచ్చిందని తెలిపారు. కొవిడ్ 19 వ్యాప్తి కారణంగా ఇబ్బందులు ఉన్న దృష్ట్యా వారిని తిరిగి బేషరతుగా విధుల్లో చేర్చుకొని ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags: Field Assistants, Uttam Kumar Reddy, TPCC, Open Letter

Advertisement

Next Story

Most Viewed