పాఠశాలలో టెన్షన్ టెన్షన్.. ఉపాధ్యాయుడికి కరోనా..

by Sridhar Babu |   ( Updated:2021-09-03 04:05:51.0  )
పాఠశాలలో టెన్షన్ టెన్షన్.. ఉపాధ్యాయుడికి కరోనా..
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా‌లోని మహాముత్తారం మండలం మాదారం పాఠశాలలో ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రెండో రోజే ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో మారుమూల ప్రాంతంలో గల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదారం పాఠశాలలో 37 మంది విద్యార్థులు ఉండగా 25 మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. కాగా, ఉపాధ్యాయుడికి వాసన లేకపోవడం, తలనొప్పి ఉండడంతో మహా ముత్తారం‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు టీచర్లు కరోనా పరీక్షలు చేయించుకోగా, ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని మండల ఇంచార్జి విద్యాధికారి దేవా నాయక్ తెలిపారు.

Advertisement

Next Story