- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన 200 మంది పూర్వ విద్యార్థులు
by Sridhar Babu |
X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1969-70, 1970-71 లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం సిరిపురం గార్డెన్ లో ఘనంగా జరిగింది. దాదాపు 200 మంది పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి 50 ఏళ్ల నాటి గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాలు, కష్టసుఖాలను తెలుసుకున్నారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన పలువురు ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్ రెడ్డి, కోటగిరి గోవర్ధన్, నల్ల ప్రభాకర్ లను ఘనంగా సత్కరించారు. కో-ఆర్డినేటర్లు ఖాజా మొయినుద్దీన్, వెంకట్ రామ్ నర్సయ్య, శ్రీనివాస రావు, భిక్షపతి, కృష్ణమూర్తి, యమునా, సుభాషిని, ఇందిర, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
Advertisement
Next Story