జాతీయగీతం పాడేందుకు ప్రజలను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం!

by Shyam |   ( Updated:2023-10-10 15:51:37.0  )
national anthem
X

దిశ, ఫీచర్స్: జాతీయగీతం ఎప్పుడు, ఎక్కడ వినిపించినా తెలియకుండానే ఆ పదసిరితో గొంతు కలిపి పరవశించిపోతాం. ఇక స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలకు ఊరు, వాడల్లో ఇదే గీతం మారుమోగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు మన నేషనల్ ఆంథెమ్ పాడాలనుకుంటున్నారా? అయితే భారత ప్రభుత్వ ‘లెట్స్ సింగ్ ది నేషనల్ సాంగ్’‌తో జత కలవండి. జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియోలను rashtragaan.inకు పంపించండి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తదితరులు జనగణమణ పాడిన వీడియోను MyGovindia అధికారిక యూట్యూబ్ పేజీలో షేర్ చేసింది.

75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’గా స్మరించుకోవడానికి ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించే వీడియోలను సమర్పించాలని భారత ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. వ్యక్తులు లేదా సమూహాలు అధికారిక వెబ్‌సైట్ rashtragaan.inలో తమ పేరు నమోదు చేసుకొని, ఓ ఫారాన్ని నింపి వారి వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. వెబ్‌సైట్ ప్రకారం జాతీయ గీతాన్ని పాడి అప్‌లోడ్ చేసిన వీడియోల సంకలనాన్ని ఆగస్టు 15, 2021న ప్రత్యక్షంగా చూపిస్తారు. పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్ అందజేస్తారు.

Advertisement

Next Story

Most Viewed