కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం

by Shamantha N |
కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం
X

దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు,సెలబ్రెటీలను సైతం వదిలిపెట్టడంలేదు. అయితే లాక్ డౌన్ తరువాత అన్ని ప్రభుత్వశాఖలు తిరిగి తెరుచుకున్నాయి. కానీ కరోనా ఉధృతి పెరగటంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. బుధవారం అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. ఈ కారణం వల్లే ఉద్యోగులు ఆఫీసులకు రావటానికి భయపడుతున్నారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేందుకు మమతా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 268 మంది పోలీసులు, 30 మంది డాక్టర్లు, 43 మంది వైద్య సిబ్బంది, 62 మంది ఇతర అధికారులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed