పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్

by Harish |
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో దీపావళి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఐదు కోట్ల మంది చందాదారులకు శుభవార్త అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 8.5 శాతం వడ్డీ రేటు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుందని సమాచారం. గత ఆర్థిక సంవత్సరం కోసం ఈపీఎఫ్ఓపై 8.5 శాతం వడ్డీ జమ చేయాలనే నిర్ణయం గతేడాది మార్చిలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) ప్రతిపాదించింది. దీనికి కార్మిక మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. తాజాగా ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందని సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నిర్ణయంతో 5 కోట్ల మంది చందాదారులకు వడ్డీ జమ కానుంది. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19లో ఉన్న 8.65 శాతాన్ని 2019-20లో 8.5 శాతానికి తగ్గించింది. గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠం. 2018-19, 2016-17లలో 8.65 శాతం వడ్డీ జమ చేయగా, 2013-14, 2014-25లో 8.75 శాతం ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం ఇచ్చారు. అయితే కరోనా మహమ్మారి పరిస్థితులతో పాటు చందాదారుల నుంచి నగదు జమ తగ్గిపోవడంతో 2019-20లో వడ్డీని 8.5 శాతానికి తగ్గించారు.

Advertisement

Next Story

Most Viewed