నేను ఎవరో తెలుసా అంటూ వారిని ప్రశ్నించిన గవర్నర్ తమిళి సై..

by Shyam |   ( Updated:2021-12-08 06:48:45.0  )
Governor
X

దిశ, నల్లగొండ: ప్రతి వ్యవసాయ సీజన్‌లో వచ్చే విపత్తులతోనే రైతులకు నష్టం వాటిళ్లుతోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె నల్లగొండలో పర్యటించారు. పోలీసులు గౌరవవందనంతో ఆమెను ఆహ్వానించారు. ఆర్జాలబావి, ఎం. దప్పలపల్లిలోని ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. ‘‘మీ పేరు ఏంటి ? ఎన్ని ఎకరాల్లో ఎంత పంట పండించారు..? ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి ఎన్ని రోజులయింది..? నేను ఎవరో తెలుసా అంటూ’’..? ఆమె రైతులతో, అధికారులతో ముచ్చిటించారు. అంతకంటే ముందు నల్లగొండ పట్టణంలోని షేర్ బంగ్లా కాలనీలోని భక్తాంజనేయ, సహిత సంతోషి మాత ఆలయంలో ధ్వజస్తంభం, మూల విరాట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

రైతులను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. గత సీజన్ లో కంటే ఈ సారి కొనుగోలు కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేశారని చెప్పారు. అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. రైతుల ఇబ్బందులను తాను తెలుసుకున్నానని చెప్పారు. సీజనల్ గా వచ్చే విపత్తులు రైతులను బాధ పెడుతున్నాయన్నారు. ఆమె వెంట నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed