మహిళా సాధికారతకు విద్య ఎంతో అవసరం !

by Shyam |
మహిళా సాధికారతకు విద్య ఎంతో అవసరం !
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సాధికారతకు విద్య ఎంతో అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటీ)లో గవర్నర్ రెండు హాస్టల్ భవనాలను, వర్మి-కంపోస్టింగ్ యూనిట్‌ను బుధవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళలు పలు రంగాల్లో వెనుకబడి ఉన్నప్పటికీ అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులు, యువతలో పెరుగుతున్న మాంద్యం కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, జీవితంలో చిన్నవిషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మన విశ్వవిద్యాలయాలు, సంస్థలకు ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ పొందడానికి నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. నోబెల్ గ్రహీత మేడం మేరీ క్యూరీ, ప్రఖ్యాత విద్యావేత్త ముత్తు లక్ష్మి రెడ్డి తర్వాత లేడీస్ హాస్టల్ బ్లాక్స్ పేరు పెట్టడంపై విఐటీని ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed