- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ద ప్రాతిపదికన మూసీ శుద్ధి
దిశ, న్యూస్‌బ్యూరో: మూసీ నది ప్రక్షాళనకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్వింద్‌కుమార్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు 22 కిలోమీటర్ల పొడవునా మూసీ నది జలాల శుద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మూసీలో ఉన్న మురికిగుంటలు, డెబ్రీస్, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తీసేందుకు వీలుగా ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఇటాచీ, ఎక్సావేటర్, జేబీసీ యంత్రాలను వినియోగించి రాత్రిబంవళ్లు షిఫ్ట్ పద్దతిలో పనులను నిర్వహించాలన్నారు. మూసీ వెంట దోమల వ్యాప్తి నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. శాశ్వత ప్రాతిపదికన డ్రోన్ల వినియోగానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.