- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠశాల పుస్తకాల కోసం నిధులు విడుదల
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాల పుస్తకాలను కొనుగోళు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. బడ్జెట్‌లో పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.16,88,2300లను విడుదల చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పాఠాశాల విద్యార్ధులందరికి ఆన్ లైన్ ద్వారానే పాఠాలను బోధిస్తున్నారు. మొదటగా బ్రిడ్జి కోర్స్ ద్వారా గత ఏడాది పాఠాలు గుర్తుచేసే విధంగా భోదనలు కొనసాగుతున్నాయి. అనంతరం ఈ ఏడాది సిలబస్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. నూతన సిలబస్ ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లను చేపట్టారు. పుస్తకాల కోసం కావాల్సిన నిధులను విడుదల చేసి సరైన సమయానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.
Advertisement
Next Story