- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఐసోలేషన్ సెంటర్లు చేయండి: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపధ్యంలో వాటి కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఆస్పత్రులన్నింట్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం ద్వారా కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు.
ఢిల్లీలోని తబ్లిఘీ జమాత్ మర్కజ్‌లో పాల్గొన్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులకు కరోనా సోకిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర అధికార యంత్రాగాన్ని సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ముగించే రోజు కూడా ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆ తరువాత కరోనాను ఎలా కట్టడి చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో ఒక టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
ఢిల్లీకి వెళ్లి కరోనా బారిన పడిన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా తొలుత వైద్య పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించింది. సెకెండరీ కాంటాక్ట్స్‌లో భాగంగా, వారికి సన్నిహితంగా మెలిగిన వారికి ఆ తరువాత పరీక్షలు పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిరంతరాయంగా కొనసాగుతుండాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ –19 లక్షణాలతో ఏ రోగి వచ్చినా ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స చేయాలని సూచించారు. ఏపీలో ఇప్పటి వరకు 7 చోట్ల కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లు ఉండగా విశాఖ, విజయవాడ సహా మూడుచోట్ల ల్యాబ్‌ల సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags: corona virus, covid-19, ap cm, ysrcp, jagan, prevention, jagan on corona