ఏపీలో ఎంసెట్ సహా.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

by Anukaran |   ( Updated:2020-07-13 09:29:22.0  )
ఏపీలో ఎంసెట్ సహా.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ విజృంభిస్తోంది. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విలయతాండవం చేస్తోంది. అయితే దీని మూలంగా తెలంగాణలో ఇప్పటికే జరగాల్సిన ఎంసెట్ సహా పరీక్షలన్నిటినీ ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలసిందే. తెలంగాణ బాటలోనే ఏపీ విద్యాశాఖ కూడా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. ఎంసెట్‌ను సెప్టెంబరు మూడో వారంలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా అందరినీ పాస్ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. జూలై నెలాఖరు వరకూ స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఐతే డిగ్రీ పరీక్షలను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. కాగా దేశంలో ప్రతిరోజూ కరోనా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed