- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పౌస్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలు ఇంకా పూర్తికాలేదు. ఇప్పటి వరకు జిల్లా కేడర్ ఉద్యోగులకు జిల్లాల కేటాయింపులు పూర్తవగా.. జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా స్పౌస్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కొత్త పోస్టింగుల్లో చేరిన తర్వాత స్పౌస్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే, జిల్లా కేడర్ ఉద్యోగులు తమ జిల్లా డిపార్ట్మెంట్ హెడ్‌కు, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు డిపార్ట్మెంట్ హెడ్స్‌కు దరఖాస్తులివ్వాలని సీఎస్ ఆదేశించారు. ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సంబంధిత శాఖ కార్యదర్శికి సిఫారసు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Next Story