- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య సిబ్బందికి ప్రేమతో గూగుల్ డూడుల్
దిశ వెబ్ డెస్క్ : దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా, కంటి మీద కునుకు లేకుండా సరిహద్దుల్లో పహారా కాసే సైనికులను మాత్రమే మనం ఇప్పటివరకు చూశాం. ఆపద వస్తే.. దేవునికి మొర పెట్టుకోవడమే కానీ ఎన్నడూ చూసింది లేదు. కరోనా వైరస్.. సరిహద్దు లోపల ఉన్న సైనికులను మనకు పరిచయం చేసింది. మనుషుల్లో ఉన్న దేవుళ్లను మనకు చూపించింది. ప్రపంచానికి విపత్తు వస్తే.. మేమున్నామంటూ ముందుకు వచ్చే.. మానవతా హృదయుల్ని మన ముందుంచింది. సాటి మనుషుల్ని కాపాడుకునేందుకు, తోటి జీవాల్ని రక్షించుకునేందుకు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు అందరూ వైద్య సిబ్బంది కృషిని కొనయాడుతున్నారు. యావత్ భారతీయ ప్రజలు వారికి చప్పట్లు కొట్టి తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఇప్పుడు గూగుల్ కూడా .. వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ‘కరోనాపై సాగిస్తున్న యుద్ధంలో ముందుండి సేవలందిస్తున్న అందరికీ డూడుల్ సిరీస్’తో కృతాజ్ఞాభివందనాలు తెలియజేయనున్నామని గూగుల్ తన పేజీలో పేర్కొంది.
కరోనా వైరస్ మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి.. వైద్య సిబ్బంది కంటి మీద కునుక లేకుండా వైద్యం అందిస్తున్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా తోటి మానవుల ప్రాణాలను రక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ తోడు లేకున్నా.. తాము ఉన్నామంటూ కరోనా బాధితులందరిలో ధైర్యం నూరిపోస్తూ… చికిత్స అందిస్తున్నారు. తమకు ఉన్న సౌకర్యాలతోనే సరిపెట్టుకుని.. కరోనా పై అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. మనుషుల్లోనూ దేవుళ్లు డాక్టర్లు, నర్సులేనంటూ మానవాళి మొత్తం వాళ్లకు చేతులెక్కి మొక్కుతున్నారంటే.. వాళ్లు చేస్తున్న త్యాగం ఎలాంటిదో మనకు అర్థమవుతోంది. అందుకే సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్‌తో కరోనా సైనికులకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అందరికీ కృతజ్ఙతలు’’అంటూ హార్ట్ ఎమోజీతో హృదయపూర్వకంగా వారి సేవలను కొనియాడింది.
కరోనాపై పోరు సాగిస్తున్న అందరికీ :
కరోనా పోరులో అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి గూగుల్ ప్రతి రోజూ ప్రత్యేక డూడుల్‌తో నీరాజనం పలుకుతోంది. వాళ్లందరిలోనూ పోరాట స్ఫూర్తి అందించడంతో పాటు, కృతజ్ఞతలు అందించడం ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశమని గూగుల్ పేర్కొంది. ఈ క్రమంలో శాస్ర్తవేత్తలు, పోలీసులు, సోషల్ వర్కర్స్, రైతులు, రైతు కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల విభాగ సిబ్బంది, అందరి సేవలను ప్రశంసిస్తూ యానిమేటెడ్ చిత్రాలు ప్రదర్శించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూ తన ప్రభావం చూపుతోంది. మనుపటితో పోలిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకరికొకరు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికి డూడుల్ సిరీస్‌తో గౌరవిస్తున్నాం’’అని గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది.
Tags : corona virus, lockdown, google, doodle, emoji, heartsymbol, love, thanks, doctors, nurse, medical workers, emergency staff