సబ్‌స్క్రిప్షన్ ఫీజులు తగ్గించిన Google

by Harish |
Google
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అన్ని సబ్‌స్క్రిప్షన్ సేవల కోసం Google Play Store ఫీజును 15శాతానికి తగ్గించనుంది. గూగుల్ తన యాప్ స్టోర్ ప్రస్తుతం ఉన్నటువంటి 30 శాతం ఫీజును 15 శాతానికి తగ్గిస్తోంది. ‘గూగుల్ ఈ-బుక్స్ మరియు ఆన్-డిమాండ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులు, కంటెంట్ ఖర్చులు ఎక్కువ అమ్మకాలకు కారణమవుతున్నాయి. తమ యాప్ స్టోర్‌లలో డిజిటల్ వస్తువులను విక్రయించే యాప్‌ల కోసం Google ఎప్పుడూ 30 శాతం కమీషన్ వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్లే స్టోర్‌లోని 3 శాతం కంటే తక్కువ యాప్‌లు ప్రస్తుతం కంపెనీ బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించడం లేదు.

దీంతో చెల్లింపు యాప్‌లో కొనుగోళ్ల కోసం గూగుల్ ప్లే స్టోర్ పేమెంట్ సిస్టమ్‌ని తప్పనిసరిగా ఉపయోగించుకునే సమస్యపై గూగుల్ ప్రస్తుతం భారతదేశ యాంటీట్రస్ట్ బాడీ సీసీఐ నుండి విచారణను ఎదుర్కొంటోంది. యాప్ డెవలపర్లు తమకు నచ్చిన పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ని ఎంచుకునే సామర్థ్యాన్ని పరిమితం చేయడం వల్ల అటువంటి పాలసీ అన్యాయమని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. అక్టోబర్ 11, 2021 న, మనీకంట్రోల్, ది అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(ADIF), న్యూ ఢిల్లీ థింక్ ట్యాంక్, పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్‌లు, గూగుల్ అమలుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉపశమనం పొందడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ని కదిలించినట్లు నివేదించింది.

Advertisement

Next Story

Most Viewed