- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డెస్క్‌టాప్ వెర్షన్‌లో ‘గూగుల్ లెన్స్’
దిశ, ఫీచర్స్ : అవసరమున్నా, లేకపోయినా ‘సెల్ఫీ’ క్లిక్స్ ఎక్కువైపోయాయి. వేడుకలు, పండుగ రోజులు పక్కనబెడితే డైలీ తీసుకునే ‘ఫొటోల’లకు లెక్కేలేదు. మరి ఈ ‘ఛాయాచిత్రాలు’ ఫోన్ మెమొరీని తినేయకుండా ఉండాలంటే వాటిని భద్రంగా ‘గూగుల్ ఫొటోస్’లో దాచేస్తాం. అయితే ప్రతి ఫొటోలోనూ ఏదో ఒక సమాచారం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించడానికి అనుమతించే ‘గూగుల్ లెన్స్’ను ప్రస్తుతం డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా అందుబాటులో తీసుకొచ్చింది గూగుల్. చిత్రంలోని టెక్ట్స్‌ను గుర్తించేందుకు గూగుల్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) అనే ఫీచర్ యూజ్ చేస్తోంది.
గూగుల్ లెన్స్ అనేది విజన్-బేస్డ్ కంప్యూటింగ్ కేపబిలిటీ. టెక్ట్స్ కాపీ చేయడానికి లేదా అనువదించడానికి.. మొక్కలు, జంతువులను గుర్తించడానికి.. మెనూల అన్వేషణ, ప్రొడక్ట్స్ డిస్కవరీతో పాటు సిమిలర్ ఫొటోగ్రాఫ్స్ కనుగొనడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ‘ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉన్న గూగుల్ లెన్స్’ ఫీచర్‌కు తాజాగా డెస్క్‌టాప్ వెర్షన్ విడుదలైంది. ఇమేజ్‌పై ఉన్న టెక్ట్స్ ఆధారంగా ఈ విషయాలను గూగుల్ ఆటోమేటిక్‌గా గుర్తించి, దాని నుంచి టెక్ట్స్ కాపీ చేస్తుంది. ఉదాహరణకు మీరు తీసిన ఫొటో మీద క్లిక్ చేసి గూగుల్ లెన్స్ ఆన్ చేస్తే.. ఆ ఫొటో ఎక్కడ తీశారో చెబుతుంది. ఒకవేళ మీరు తాజ్‌మహల్ ముందు దిగిన ఫొటోపై గూగుల్ లెన్స్ క్లిక్ చేస్తే తాజ్‌మహల్ వివరాలన్నీ చూపిస్తుంది. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా కంపెనీ పేరు కనిపిస్తే, అందుకు సంబంధించిన వివరాలను మీ ముందుంచుతుంది. బార్ కోడ్ వివరాలు స్కాన్ చేస్తే, ఆ వివరాలన్నిటినీ చూసుకోవచ్చు. అయితే ఆ ఫొటోలో అక్షరాలు క్లియర్‌గా కనిపించాలి. అయితే గూగుల్ ఫొటోల డెస్క్‌టాప్ వెర్షన్‌లో గూగుల్ లెన్స్ ఫీచర్స్ అన్నీ అందుబాటులో ఉండవని గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి మొక్కలు, స్మారక చిహ్నాలను గుర్తించగల సామర్థ్యం దీనికి లేదు.
ఈ ఫీచర్ ద్వారా మరో ఉపయోగం ఏంటంటే.. చేతితో రాసిన దేన్నయినా ఫొటో తీస్తే, ఆ డేటా నేరుగా వారి డెస్క్‌టాప్‌లో సేవ్ అవుతుంది. అంటే మీరు ఏ విషయాన్ని అయినా పేపర్ మీద రాసుకుంటే.. దాన్ని కంప్యూటర్‌లో టైప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.