జియో తర్వాత గూగుల్ దృష్టి ఈ సంస్థ పైనే…

by Shamantha N |
జియో తర్వాత గూగుల్ దృష్టి ఈ సంస్థ పైనే…
X

అమెరికా టెక్నాలజీ దిగ్గజాల దృష్టి ఇప్పుడు భారత్ సంస్థలవైపుకు మళ్లింది. దేశంలోని పలు కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే జియో ప్లాట్ ఫామ్స్ (jio platforms) లో వాటా కొనుగోలు చేసింది గూగుల్ (google). ఇప్పుడు మరో ఆన్లైన్ బీమా సేవల కంపెనీ (online insurance company) లో పెట్టుబడులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాలసీబజార్ డాట్ కామ్ (policybazaar.com) లో 10 శాతం వాటాను 15 కోట్ల డాలర్లకు కొనే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. భారత కరెన్సీలో సుమారు రూ.1,125 కోట్లు ఉంటుంది. జపాన్ కి చెందిన ఇన్వెస్టిమెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ (softbank group) కు పాలసీబజార్ లో 15% వాటా ఉంది. ఇందులో కొంత గూగుల్ కు అమ్మే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed