- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google Doodle : గే రైట్స్ యాక్టివిస్ట్‌కు ‘డూడుల్’తో గూగుల్ నివాళి
దిశ, ఫీచర్స్ : మనుషులందరూ సమానమే కానీ ‘మూడో మనిషి’పై మాత్రం సొసైటీలో వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే స్వలింగ సంపర్కులు తమ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆ పోరాటాల ఫలితంగా వారు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లోనూ ఉనికిని చాటుకోగలుగుతున్నారు. అయితే ఎల్‌జీబీటీక్యూలు తొలిసారిగా 1969 జూన్ నెలలోనే అమెరికాలో ‘స్టోన్‌వాల్’ నిరసనలు జరిపారు. ఆ జ్ఞాపకార్థంగా ఈ నెలలో ‘ఎల్‌జీబీటీ ప్రైడ్’ పేరున సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్‌జీబీటీ సభ్యులు వేడుకలతో పాటు పరేడ్‌లు, మార్చ్‌లు నిర్వహిస్తుంటారు. ఇక స్వలింగ సంపర్కుల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని ముందుండి నడిపించిన తొలి వ్యక్తి డాక్టర్ ఫ్రాంక్ కామెనీ కాగా, ‘ప్రైడ్ మంత్’ సందర్భంగా గూగుల్ డూడుల్‌తో ఆయనకు నివాళి అర్పించడం విశేషం.
గూగుల్ డూడుల్ బుధవారం అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త, స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త డాక్టర్ ఫ్రాంక్ కామెనీని సత్కరించింది (Google honours American gay rights activist Frank Kameny with a doodle) . ఎల్‌జీబీటీక్యూల ‘రెయిన్ బో’ రంగుల్ని ప్రతిబింబించేలా కామెనీ మెడలో రంగురంగుల దండను డిజైన్ చేసిన గూగుల్.. ‘దశాబ్దాల పురోగతికి ధైర్యంగా మార్గం సుగమం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. యూఎస్ ఎల్‌జీబీటీక్యూ హక్కుల ఉద్యమ ప్రభావిత వ్యక్తుల్లో కామెనీ ఒకరు’ అంటూ అభివర్ణించింది.
మే 21, 1925న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించిన కామెనీ.. 15 ఏళ్ల వయసులోనే ఫిజిక్స్‌లో పట్టా పొందేందుకు క్వీన్స్ కాలేజీలో చేరాడు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఖగోళశాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్న ఆయన.. 1957లో ఆర్మీ మ్యాప్ సర్వీస్‌లో ఖగోళ శాస్త్రవేత్త అయ్యాడు. కానీ కొన్ని నెలలకే ప్రభుత్వం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ సభ్యులను ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్(సమాఖ్య ఉపాధి) నుంచి నిషేధించడంతో ఉద్యోగం కోల్పోయిన కామెనీ ప్రభుత్వంపై కేసు ఫైల్ చేశాడు. ఆ తర్వాత 1961లో ఫస్ట్ గే రైట్ అప్పీల్‌ను యూఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడంతో పాటు అమెరికాలో మొదటి స్వలింగ హక్కుల న్యాయవాద బృందాల్లో ఒకదాన్ని నిర్వహించాడు. ఈ క్రమంలో 1970 ప్రారంభ రోజుల్లో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ‘స్వలింగ సంపర్కాన్ని’ మానసిక రుగ్మతగా వర్గీకరించడాన్ని ఆయన సవాల్ చేయడం విశేషం. ఇక కామెనీని ఆర్మీ మ్యాప్ సర్వీస్ నుంచి తొలగించిన 50 ఏళ్ల(2009లో) తర్వాత అధికారికంగా క్షమాపణలు చెప్పిన యూఎస్ ప్రభుత్వం.. జూన్ 2010 లో వాషింగ్టన్ డి.సి. డుపోంట్ సర్కిల్ సమీపంలోని 17వ వీధి NWను ‘ఫ్రాంక్ కామెనీ వే’ పేరుతో గుర్తించింది. కాగా, కామెనీ 11 అక్టోబర్ 2011న వాషింగ్టన్ డి.సి.లో మరణించారు.