- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google ప్లేస్టోర్‌లో భయంకరమైన మాల్వేర్..వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి
దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరికను జారీ చేసింది. అత్యంత ప్రమాదకరమైన జోకర్ మాల్వేర్ ఈ మధ్యకాలంలో గూగుల్ ప్లేస్టోర్‌లో కనబడిందని Google తెలిపింది. ఇప్పటికే 5 లక్షల మంది వినియోగదారులు జోకర్ మాల్వేర్‌తో లింక్ ఉన్న యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంతకుముందు 2017లో గూగుల్ మొదటిసారిగా జోకర్ మాల్వేర్‌ను గుర్తించింది. జోకర్ అత్యంత ప్రమాదకరమైన Android మాల్వేర్‌లలో ఒకటి. ఫ్లీస్‌వేర్ యాప్‌గా వర్గీకరించబడింది. ఇది SMS సందేశాలు, సంప్రదింపు జాబితా, పరికరానికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఇది వినియోగదారులకు తెలియకుండానే ప్రీమియం సర్వీస్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం సైన్ అప్ చేస్తుంది. వినియోగదారుల బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకుంటుంది. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
ప్రస్తుతం కలర్ మెసేజ్ యాప్‌లో దీని కదలికలు ఉన్నాయి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు తమంతట తాముగా యాప్‌ను తీసివేయాల్సి ఉంటుంది.
కలర్ మెసేజ్ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలో ఇది కనుగొనబడింది.
-సేఫ్టీ యాప్‌లాక్
-కన్వీనియంట్ స్కానర్ 2
-ఎమోజి వాల్‌పేపర్
-సెపరేట్ డాక్ స్కానర్
-ఫింగర్‌టిప్ గేమ్‌బాక్స్
-ఈజీ పిడిఎఫ్ స్కానర్
-సూపర్-క్లిక్ VPN
-వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వలైజర్
-ఫ్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ యాప్ వంటి అనేక ఇతర Google Play స్టోర్ యాప్‌లు ఉన్నాయి. ఆన్ కాల్, కొన్ని ఇతర యాప్‌లు కూడా జోకర్ మాల్వేర్‌తో కనుగొనబడ్డాయి.