- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ డుయోలో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు హై క్వాలిటీ వీడియో కాల్‌లను అందించిన గూగుల్ డుయోలో ఇప్పుడు కొత్తగా స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా వచ్చింది. గూగుల్ మీట్‌లో ఆఫీస్ అవసరాల కోసం ఇప్పటికే ఈ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. గూగుల్ డుయోలో కూడా ఇలాంటి ఆప్షన్ కావాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న యూజర్‌ల కోసం ఫైనల్‌గా అది అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గూగుల్ డుయోలో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇప్పుడు ఒకరితో ఒకరు మొబైల్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇలా చేసినపుడు ముందు కెమెరా ఆఫ్ అయ్యి, సెల్ఫీ స్థానంలో స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ చేస్తుండగా ఎరుపు రంగు క్రోమ్ క్యాస్టింగ్ చిహ్నం కనిపిస్తుంది. స్క్రీన్ షేరింగ్ పూర్తయ్యాక దాన్ని ముగించడానికి రెండు ఆప్షన్‌లు ఉంటాయి. ఒకటి స్క్రీన్ షేర్ ఆపివేయడం, రెండోది పూర్తిగా వీడియో కాల్ ఆపివేయడం. ఈ ఆప్షన్ పొందడానికి డుయోను అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ తమ బ్లాగ్‌లో పేర్కొంది.