- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఈ నెల 5న జాబ్ మేళా..
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి ఎస్ మైత్రి మంగళవారం వివరాలు వెల్లడించారు. మల్లెపల్లి ఐటీఐ క్యాంపస్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని, దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కొంపల్లిలోని డాటా సొల్యూషన్స్ తో పాటు పలు పేరొందిన కంపెనీలలో ఎంపికైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, రూ 10 వేల నుండి రూ 18 వేల వరకు వేతనాలు ఇవ్వబడుతాయని వివరించారు. 18 సంవత్సరాల నుండి 30 ఏండ్లు పైబడిన యువకుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువకులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలతో విజయ్‌నగర్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూలకు ఉదయం 11 గంటల లోపు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు యంగ్ ప్రొఫెషనల్ టి రఘుపతి ఫోన్ నెంబర్ 8247656356 కు సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.