ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్

by  |
Good-News1
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఏపీ ప్రభుత్వం ఆప్షన్లు తీసుకోనున్నది. తెలంగాణ తరహాలోనే స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. స్పౌజ్ కేసులకు సంబంధించి 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని ఓ అంచనాకు వచ్చింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ మాట్లాడుతూ.. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికుల నుంచి ఆప్షన్లను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎంను కోరామని తెలిపారు.

Advertisement

Next Story