- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సజ్జనార్ మార్క్.. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం
దిశ, డైనమిక్ బ్యూరో : గత కొన్నేళ్లుగా ప్రజా రవాణా ఆర్టీసీ నష్టాల్లోనే నడుస్తోంది. ప్రభుత్వ సాయంతోనే కార్మికులకు జీతాలు, బస్సుల నిర్వహణ సాధ్యమవుతోంది. అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో సంస్థ మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. ఈ క్రమంలో ఆర్టీసీపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. డైనమిక్ పోలీసు ఆఫీసర్ వీసీ సజ్జనార్‌ను ఎండీగా నియమించారు.
ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఫలితంగా ఒకటో తేదీన జీతాలు కార్మికుల అకౌంట్‌లో పడ్డాయి. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. TSRTC మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు. ఆర్టీసీ ఒక సంస్థ మాత్రమే కాదు ఒక కుటుంబం. మనమంతా దానిలో సభ్యులం. మన కుటుంబం మన ఆర్టీసీ మన సంస్థ.. కలిసికట్టుగా కష్టపడతాం దాని అభివృద్ధికి మన వంతు సహాయం చేద్దామని అన్నారు.
గత మూడేళ్లుగా ఒకటో తేదీన జీతాలు పొందడం కలగానే ఉన్న క్రమంలో ఆయన మార్క్ చూపించి సంస్థలో మార్పు తెచ్చారంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.