- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కూలీలకు శుభవార్త..ఇళ్లకు వెళ్లొచ్చు!
కార్చిచ్చులా రేగిన కరోనా వైరస్ మే 3వ తేదీ నాటికి ఒక కొలిక్కి వస్తుందని, దీంతో అప్పటి నుంచి లాక్‌డౌన్ ముగుస్తుందని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ముగుస్తుందా? లేదా? అన్న చర్చ నడుస్తున్న వేళ… ఉపాధి కోసం వలస వెళ్లి పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస జీవులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ఆయా ప్రాంతాల నుంచి వారి సొంత గ్రామాలకు పంపేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో ఏజిల్లాలో ఎంత మంది వలస కూలీలు చిక్కుకుపోయారో తెలిసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్క తేలిన తరువాత వారిని స్వస్థలాలకు పంపనుంది. అయితే, వారందరికీ ర్యాపిడ్ విధానంలో కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాతే స్వస్థలాలకు చేర్చాలని భావిస్తోంది.
వారిని తరలించేందుకు బస్సులు నడపనున్నట్టు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో నడిపే బస్సుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన కూలీలను మాత్రమే స్వస్థలాలకు అనుమతించాలని నిర్ణయించింది. వలస కూలీలు బృందాలుగా ఉంటే ఆ బృందంలో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా వారంతా ఉన్నచోటే ఉండాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనల మేరకు వారికి కూడా వైద్యం అందించిన తరువాత, నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే వారిని స్వగ్రామాలకు తరలించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ సడలింపు అనంతరం గ్రీన్ జోన్‌లో ఉన్నవారు మాత్రమే తమ స్వస్థలాలకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఏపీ రవాణాశాఖ తెలిపింది.
ఏపీ రవాణ శాఖ ఏర్పాటు చేసే బస్సుల్లో 50 శాతం సీట్లలో మాత్రమే కూలీలు కూర్చునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఆ 50 శాతం సీట్లలో కూడా భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా సొంతూరికి వెళ్లిన 14 రోజుల వరకు వారంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. వారికి కరోనా లక్షణాలు కనిపించలేదని తేలిన తరువాతే వారు బయట స్వేచ్ఛగా తిరగొచ్చని తెలిపింది.
Tags: corona lock down, ap, coronavirus, lockdown, migrant workers, good news for migrant workers, labour