డీఎస్సీ 2008 అభ్యర్థులకు తీపికబురు

by srinivas |
డీఎస్సీ 2008 అభ్యర్థులకు తీపికబురు
X

దిశ, ఏపీ బ్యూరో: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా జీవో జారీ చేసి వారికి పోస్టింగ్‌లు ఇస్తామని స్పష్టం చేసింది. డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులు 13 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సీఎం జగన్ వారికి అండగా నిలిచారని.. 2,193 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించేందుకు ఆమోదం తెలిపారని చెప్పారు. త్వరలో జీఓ ఇచ్చి వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు.

ఈ నియామకాలతో ఏటా సుమారు 50 నుండి 60 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి సురేశ్ చెప్పారు. మరోవైపు తమను ఎస్జీటీలుగా నియమించేందుకు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు 2008-డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌ను కలిశారు. వారి వెంట మంత్రి సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉన్నారు.

Advertisement

Next Story