తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..

by Shyam |
తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కొత్త మినిమం బేసిక్ ‘పే’ కు సంబధించి ఆర్థిక శాఖలో ఫైల్ క్లియరెన్స్ లభించిందని ఎమ్మెల్సీ రఘొత్తం రెడ్డి ప్రకటించారు. కేజీబీవీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కూడా మంజూరు చేశారని తెలిపారు.

పీర్టీయూ ప్రాతినిధ్యం వలనే అధ్యాపకుల డిమాండ్లు నెరవేరాయని చెప్పారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత పీఆర్టీయూ సంఘానిది అని భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయులకే కాకుండా అన్ని వర్గాల ఉద్యోగులు కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో పీఆర్టీయూ సంఘం ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తమరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed