ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

by srinivas |
AP government
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 15 రోజుల సెలవులకు అదనంగా సీఎల్‌లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ రోజు G.O. Ms. No 18 విడుదల చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వెసులుబాటు కల్పించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళా అధ్యాపకులు, లెక్చరర్లకూ అదనపు సీఎల్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 5 రోజులు సెలవులు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజు సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మహిళలకు ఐదు రోజుల అదనపు సెలవులు మంజూరు చేసినందుకు సీఎం వైఎస్ జగన్ కి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed