ఐసీఏఆర్ బోర్డు సభ్యుడిగా గోనె శ్యామ్ సుందర్రావు

by Aamani |
ఐసీఏఆర్ బోర్డు సభ్యుడిగా గోనె శ్యామ్ సుందర్రావు
X

దిశ, చెన్నూర్: మంచిర్యాలకు చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు గోనె శ్యామ్ సుందర్ రావు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ నిర్ణయంపై చెన్నూరు పట్టణ భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా భాజపా పార్టీ అభివృద్ధి కోసం ఫలితం ఆశించకుండా కష్టపడుతున్న ఆయన్ను బోర్డు సభ్యుడిగా నియమించినందుకు పార్టీ అధిష్టానానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, పట్టణ అధ్యక్షులు, సుశీల్ కుమార్ ఆర్.వెంకటేశ్వర్లు చింతల శ్రీనివాస్, తుమ్మ శ్రీపాల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story