అమ్మకాలు లేకపోయినా పెరిగిన బంగారం ధర!

by Harish |   ( Updated:2020-04-13 08:29:13.0  )
అమ్మకాలు లేకపోయినా పెరిగిన బంగారం ధర!
X

దిశ, వెబ్‌డెస్క్: పరిస్థితులు ఎలా ఉన్నా, కొనుగోళ్లు లేకపోయినా బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. దేశీయంగా విక్రయాలు లేకపోయినప్పటికీ అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు పైపైకి వెళ్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గంటల వ్యవధిలోనే బంగారం ధరలు 1.45 శాతం పెరిగాయి. మునుపటి సెషన్‌తో పోలిస్తే పది గ్రాముల బంగారం ధర రూ.506 పెరిగి రూ. 45,800 కి చేరింది. లాక్‌డౌన్ కారణంగా దేశంలో బంగారం ఆర్డర్లు తీసుకోవడంలేదు. మే నెలలో కూడా డెలివరీకి ఆర్డర్లను తీసుకోవడంలేదని జ్యువెలరీ యజమానులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో మార్చి నెలతో ఈ ఏడాది బంగారం దిగుమతులు 73 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఒక నెల గరిష్ఠానికి చేరుకుంది. వారం క్రితం యూఎస్ ఫెడ్ ప్రకటించిన ఉద్దీపనల చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన తగ్గి, బంగారాన్ని డిమాండ్ పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా బంగారం ఔన్స్ బంగారం 1687 డాలర్లుగా ఉంది.

Tags : gold price, gold rate, coronavirus, covid-19, gold price in india, lockdown

Advertisement

Next Story

Most Viewed