అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా: మిథాలీ

by  |
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా: మిథాలీ
X

దిశ, స్పోర్ట్స్: తాను క్రికెట్‌లో ఎంతో సాధించానని, 2017లోనే ప్రపంచ కప్ సాధించి ఉంటే అప్పుడే క్రికెట్ నుంచి రిటైరయ్యేదాన్నని భారత మహిళల క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. తన జీవితంలో ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, కానీ ఇప్పటికీ ఈ కప్ సాధించకపోవడం పెద్ద లోటుగా ఉన్నదని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను గెలవడంపైనే దృష్టిపెట్టానని, అంతవరకు రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన లేదని మిథాలీ స్పష్టం చేసింది. గతంలో పలు మార్లు టైటిల్ సాధించడానికి అవకాశాలు వచ్చినా పోగొట్టుకున్నామని, ఈసారి అలా జరగనివ్వమని దీమా వ్యక్తం చేశారు. ‘2013లో జరిగిన టోర్నీలో మేం కనీసం సూపర్‌ సిక్స్‌కు కూడా అర్హత సాధించలేదు. అప్పుడు నేను చాలా నిరాశ చెందాను. 2017లో ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఓ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా చాలా కష్టపడ్డాను. అందుకే ఫైనల్లో గెలిచాక గుడ్‌బై చెబుదామనుకున్నా. అప్పుడు కూడా ఫలితం లేదు. అందుకే 2021లో మరో ఛాన్స్‌ తీసుకుందామనుకుంటున్నాను’ అని మిథాలీ తెలిపింది.


Next Story

Most Viewed