- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మవారి ఆభరణాలు చోరీ
దిశ ప్రతినిధి , హైదరాబాద్: అర్ధరాత్రి వేళ అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి తెగబడ్డారు . ఆలయంలో సీసీ కెమెరాలు ఉండడాన్ని గుర్తించిన దొంగలు డీవీఆర్‌ను కూడా దొంగిలించారు. ఈ ఘటన నగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీ అంజయ్య కథనం ప్రకారం… అబిడ్స్ జగదీశ్ మార్కెట్‌లోని అమ్మవారి ఆలయానికి రోజు మాదిరిగానే శనివారం రాత్రి కూడా పూజారి పండిత్ ప్రవీణ్ కుమార్ తాళం వేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ఆలయం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు.
అమ్మవారి వెండి కిరీటం, వెండి గొడుగు, అమ్మవారి ముక్కు పుడక ఆభరణాల తోపాటు సీసీ ఫుటేజ్ డీవీఆర్‌ను కూడా దొంగలు వెంటతీసుకువెళ్లారు. ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి… ఆలయంలో దొంగ తనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభిచారు. ఎలాంటి ఆధారాలు దొరకకుడా ఉండేందుకు డీవీఆర్ ఎత్తుకు వెళ్లడంతో పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటిల్లో కొన్ని ఆధారాలు లభించాయని , త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని ఇన్ స్పెక్టర్ అంజయ్య తెలిపారు. చోరీకి గురైన ఆభరణాల విలువను అంచనా వేస్తున్నామని తెలిపారు.