- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హై అలర్ట్.. ప్రమాదస్థాయిలో గోదావరి.. కలెక్టర్ హెచ్చరిక
దిశ, భద్రాచలం: ఎగువ ప్రాంతం నుంచి వచ్చే భారీ వరదలతో భద్రాచలంలో గోదావరి నది ప్రమాదస్థాయిలో ప్రవహించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంతాల్లో అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లక్ష్మి బ్యారేజ్ (మేడిగడ్డ) నుంచి 12 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజ్ (తుపాకులగూడెం) నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నదులతోపాటు తాలిపేరు నుంచి వచ్చే వరదలతో శుక్రవారం రాత్రికి గోదావరికి మొత్తం 13 నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా నీటి మట్టం 52 – 53 అడుగులకు (3 వ ప్రమాదం హెచ్చరిక స్థాయి) చేరుకునే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.
వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. అధికారులు అందరూ వారి వారి స్థానాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సంబంధిత కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అలాగే, పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సిన బాధ్యత తహసీల్దార్‌లదే అని నొక్కి చెప్పారు. వంతెనలు, రహదారులపై నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రజా రవాణాను పకడ్బందీగా నిషేధించాలని.. వరద ఉధృతికి వాహనాలు సైతం కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. నీటి ఉధృతి తగ్గిన తరువాత కూడా.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు జాలర్లు చేపల వేటకు వెళ్ళరాదని సూచించారు. అత్యవసర సేవలకు 08744-421950, 08743-232444 కంట్రోల్ రూమ్ నంబర్లుకు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.