- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీలో జీవో నంబర్ 317ను పూర్తిగా మినహాయించాలి
దిశ, గుడిహత్నూర్ : జీవో నంబర్ 317 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగుల బదిలీలను వారి స్థానికత ఆధారంగానే చేపట్టాలని ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉయిక లక్ష్మీన్ డిమాండ్ చేశారు. ఆదివాసి ప్రజా సంఘాల పిలుపు మేరకు గూడిహత్నుర్ మండల వ్యాప్తంగా బంద్ కొనసాగింది. ఆదివాసీసేన నాయకులు ర్యాలీలు తీసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఉయిక లక్ష్మీన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ల మా ఉద్యోగాలు, నీళ్లు, వనరులను దోచుకుంటున్నారని పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జోనల్ బదిలీల పేరుతో ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యతనివ్వకుండ ఇష్టరీతిన ఉద్యోగులను బదిలీ చేయడాన్ని తప్పుపట్టారు.
ఉద్యోగుల స్థానికత కోరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల ఉద్యోగుల స్థానికతను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లటం వలన ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ విధంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టడం వల్ల గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి స్థానికతకు ప్రాధాన్యతానివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యామన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలు భూమి, ఉనికి, అస్తిత్వం, భాష సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని, ఇతర మైదాన ప్రాంతాల నుంచి బదిలీలపై వస్తున్న ఉద్యోగులను గో-బ్యాక్ నినాదాలతో వెనక్కి పంపించేందుకు సిద్ధండా ఉండాలని ఉయిక లక్ష్మీన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్, రాయి సెంటర్ సార్మేడి కాత్లే భరత్, ఆదివాసీ విద్యార్థి సంఘం గూడిహత్నుర్ మండల అధ్యక్షుడు మర్సకోల నగేష్, ఆదివాసీ విద్యార్థి సేన మండల అధ్యక్షుడు కుంరం చత్రుఘన్, ఆదివాసీ సంఘ నాయకులు మేస్రం నాగ్నాథ్, మర్సకోల జైతు, కాత్లే పరశురాం, తోడషం లక్ష్మీన్, కుంరం అచ్చంత్ రావు, మేస్రం జంగు, సోయం బోజ్జు, మడావి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.