- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్-19వ్యాక్సిన్ల రవాణాకు సిద్ధం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ దేశాలు కొవిడ్-19 సెకెండ్ వేవ్‌ను ఎదుర్కొంటూ మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహమ్మారిపై పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పరీక్షలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. గత దశాబ్దంలో ప్రపంచ వ్యాక్సిన్లలో 60%ఉత్పత్తి చేసే గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్, టీకా కేంద్రంగా భారతదేశం అవతరించింది. దీనిలో భారతదేశ ఫార్మా హబ్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరుగాంచి, ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో మూడో వంతుకు పైగా హైదరాబాద్‌లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొవిడ్ -19వ్యాక్సిన్లను మిలియన్ల మోతాదులో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం సగం సమస్య మాత్రమే. భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా వాటిని పంపిణీ చేయడమన్నది అతి పెద్ద సవాలుగా నిలుస్తుంది. అదృష్టవశాత్తూ, వ్యాక్సిన్ల రవాణాకు సాధ్యమైనంత మెరుగైన రవాణా ఏర్పాట్లు జరిగేలా కొన్ని సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో గ్లోబల్ వ్యాక్సిన్ల రవాణాకు, వ్యాక్సిన్ల సమగ్రతను కాపాడటానికి ఆటంకాలు లేని కూల్ చైన్ సదుపాయాలు అవసరం. ఇలాంటి ఎన్నో సదుపాయాలు కలిగిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వ్యాక్సిన్ల రవాణాలో ప్రధాన పాత్రను పోషించనుంది. కొవిడ్-19 వ్యాక్సిన్లకు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. తయారీదారుల కేంద్రం నుంచి తుది గమ్యస్థానానికి వ్యాక్సిన్లను రవాణా చేసే ప్రక్రియలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉత్పత్తిదారులు, సప్లై-చైన్ భాగస్వాముల సమన్వయంతో పలు విధానాలను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్ కార్గోలో నిర్ధిష్టమైన ఉష్ణోగ్రతల మధ్య వ్యాక్సిన్లను స్వీకరించడం, పరీక్షించడం, నిర్వహించడం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు ఉన్నాయి. టెర్మినల్ యొక్క ఫార్మా జోన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ధృవీకరించబడింది. ఔషధ, వ్యాక్సిన్ రవాణా కోసం ఎయిర్ కార్గో మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి ఆటంకాలు లేని కూల్-చైన్ అందిస్తుందని జీఎంఆర్ సంస్థ పేర్కొంది.
సెన్సిటివ్ వ్యాక్సిన్ షిప్మెంట్లను హ్యాండిల్ చేసేటప్పుడు మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణకు కూల్ జోన్లు/కంటైనర్లలో ఉష్ణోగ్రత డేటా లాగర్లు, హ్యూమిడిటీ (తేమ) సెన్సార్లు ఉంటాయి. స్క్రీనింగ్ చేసేటప్పుడు వ్యాక్సిన్ల కూల్ కంటైనర్లు పాడవకుండా ఉండడానికి డ్యూయల్ వ్యూ టన్నెల్ ఎక్స్-రే స్క్రీనింగ్ మెషీన్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి, దిగుమతి కోసం కార్గో ఇప్పటికే వివిధ సంప్రదాయ వ్యాక్సిన్ షిప్మెంట్లను హ్యాండిల్ చేస్తోంది. క్లిష్టమైన వ్యాక్సిన్లను ఎలాంటి ఆటంకాలూ లేకుండా రవాణా చేయడానికి ఫార్మా జోన్‌ను ఏర్పాటు చేసింది. ఉష్ణోగ్రత నియంత్రిత కండిషన్స్‌లో స్వీకరించడం, తూకం వేయడం, కస్టమ్స్ పరీక్షలు, స్క్రీనింగ్, ప్యాలెటైజేషన్, విమానాలకు రవాణా వంటి క్లిష్టమైన ప్రక్రియలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి.