- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha Akkineni: సమంత- చైతన్య విడాకులు.. పుకార్లను వదిలి ఫ్రెండ్ తో షికార్లు చేస్తోందిగా..?
దిశ, వెబ్‌డెస్క్: సమంత అక్కినేని.. గతకొద్ది రోజులుగా అమ్మడి పేరు సోషల్ మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో సోషల్ మీడియా అకౌంట్ నుంచి అత్తవారి ఇంటి పేరు అక్కినేనిని తొలగించి అనుమానాలకు ఆజ్యం పోసిన సామ్ తన వైవాహిక బంధం గురించి క్లారిటీ ఇవ్వకుండా అభిమానులను కన్ప్యూజ్ లోకి నెట్టి ఆమె మాత్రం ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంది అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. టాలీవుడ్ లో అడోరబుల్ కపుల్ గా పేరుతెచ్చుకున్న నాగ చైతన్య- సమంత మధ్య విభేదాలు నెలకొన్నాయని, త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారని వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇందుకు బలం చేకూర్చేలా ఇటీవల నాగ్ బర్త్ డే కి సామ్ అటెండ్ కాకపోవడం, ఇంతగా వార్తలు వినిపిస్తున్నా అక్కినేని ఫ్యామిలీ స్పందించకపోవడంతో నిజమేనేమో అన్న అనుమానాలు లేకపోలేదు. అంతేకాకుండా నాగ్ బర్త్ డే కన్నా స్నేహితులతో వెకేషన్ యే సామ్ కి ముఖ్యమైందా..? అన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక ఇలాంటి పుకార్లను పట్టించుకోను, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడే చెప్తాను అంటూ చెప్తూనే మరోపక్క మీడియా పై ఇన్ డైరెక్ట్ గా సామ్ కౌంటర్లు వేయడం గమనార్హం.
ఇక ఇవన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం సమంత తన స్నేహితులతో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కుటుంబంతో సామ్ గోవాకు బయలుదేరిన సంగతి తెలిసిందే. తన ప్రాజెక్ట్స్ అన్నింటిని పూర్తిచేసి కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేస్తానని తెలిపిన సామ్ చెప్పినట్లుగానే గోవాలో షికార్లు చేస్తోంది. ఆ టూర్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తన అనుభూతులను అభిమానులతో పంచుకుంటుంది. కానీ, అభిమానులు, నెటిజన్లు మాత్రం అసలు ఆ టూర్ లో చై లేకపోవడమేంటి..? అతని గురించి ఎందుకు మాట్లాడడంలేదనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్వావ్ ఫ్రెండుతో కలిసి పడవ ప్రయాణం.. చై మిస్సయ్యాడేమిటో అంటూ కలతకు గురవుతున్నారు. మరోపక్క చైతన్య సైతం ఈ విషయంపై నోరు మెదపకపోవడం ఇంకా అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం చై పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి సామ్ – చై మధ్య ఏం జరిగిందో తెలియాలంటే వారు చెప్పేవరకు ఆగాల్సిందే.