- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆసీస్ క్రికెటర్.. ఇక భారత్ అల్లుడు
ఆసీస్ డాషింగ్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ దూకుడైన ఆటకు మారుపేరు. భారీ షాట్లను అలవోకగా కొట్టే మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బంధం కలుపుకోవడం ద్వారా భారతీయులను బుట్టలో వేసుకోనున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయులకు అల్లుడు కానున్నాడు.
మానసిక సమస్యలతో బాధపడుతున్నాను, కొన్నాళ్లు ఆటకు విరామం తీసుకుంటానంటూ ధైర్యంగా ప్రకటించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రేమలో పడ్డాడు. ఫార్మసిస్టుగా పని చేసే భారత సంతతి అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఆమెకు ఉంగరం తొడిగి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. దానికి ఆమె కూడా సరే అనడంతో పెళ్లి బాజాలకు సిద్ధమైపోయారు. త్వరలో వీరి పెళ్లి జరుగనుంది.
మ్యాక్స్‌వెల్ మనసు దోచుకున్న యువతి పేరు విని రామన్. వారి కుటుంబం చాలా క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడింది. మొల్బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. విరామం లేని క్రికెట్ కారణంగా మానసిక సమస్యలో చిక్కుకున్నాడని గుర్తించింది కూడా విని రామనే కావడం విశేషం. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ మీడియా కెమెరాలకు కూడా చిక్కారు. ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.