- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ను గెలిపించినందుకు పశ్చాత్తాపంగా మెదక్‌ను మాకు ఇవ్వండి
దిశ, డైనమిక్ బ్యూరో : నాలుగుకోట్ల ప్రజల విముక్తి కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పశ్చాత్తాపంగా మెదక్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించండి. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవిని ఇవ్వలేదు ఆలోచించండి. నీకు నిజంగా దళితులపై అభిమానం ఉంటే మీ ఇంట్లో ఉన్న ఓ మంత్రి పదవిని తీసేసి మాదిగ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వండి. ఈ 40 రోజుల్లో మారుమూల గ్రామాల దళిత, గిరిజనులను తెలంగాణ వస్తే ఏం వచ్చిందని అడగితే.. మా పిల్లల చావులొచ్చినయ్, మా బతుకులు చితికిపోయినయ్, పోడు భూములను హరితహారం పేరిట లాక్కున్నరు అన్నారు.
కేసీఆర్ మనవడు చదువుకుంటున్న స్కూల్‌లో దళితుల పిల్లలు చదివి దేశాన్ని ఏలాలనుకుంటున్నారు. గొర్రెలు, బర్రెలు మాకెందుకు .. మాకు చదువులు, ఉద్యోగాలు కావాలి. పేదలకోసం ఆరోగ్య శ్రీ తెస్తే కరోనాని దానిలో చేర్చకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆరోగ్య శ్రీని రూ.5 లక్షలకు పెంచాలి. ఏ రోగమొచ్చిన కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందించాలి. కేజీ టూ పీజీ అని చెప్పి వదిలేసిండు. దళితులు గిరిజనుల పిల్లలను చదువు నుంచి దూరం చేసే విధంగా తాండాల్లో 4632 బడులను బంద్ చేసి విద్యను దూరం చేసిండు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.