- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలికి గర్భం.. ఫేస్‌బుక్‌లో ఆ చిత్రాలు ట్రెండింగ్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండేళ్లు కలిసి సహజీవనం చేశాడు. ప్రియురాలు గర్భవతి కావడంతో ప్రియుడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఆమెను అవమానపర్చాడు. అయినా అతడి కోసం ఆ ప్రియురాలు గర్భంతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలియా జిల్లాకు చెందిన యువతికి అదే జిల్లా విజయనగర్‌కు చెందిన అమిత్ మౌర్య 2019లో పరిచయం అయ్యాడు. ఆ స్నేహాన్ని ఆసరాగా తీసుకున్న అమిత్.. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి లొంగిపోయింది. అలా ఇద్దరు కలిసి రెండేళ్లకు పైగా సహజీవనం చేశారు. ఆ సమయంలో అమిత్.. శృంగార ఫొటోలు, వీడియోలను యువతికి తెలియకుండా రికార్డు చేశాడు. ఈ క్రమంలో ప్రియురాలు గర్భం దాల్చింది. దీంతో అమిత్ మౌర్య ఆమెకు చెప్పకుండా వెళ్లిపోయాడు.
ఆపై యువతి అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి వాటిల్లో పెట్టాడు. అమిత్ మౌర్య కోసం రోజుల తరబడి ఎదురు చూసిన యువతి.. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. ఫేస్ బుక్, సోషల్ మీడియాలో కూడా ఆమె నగ్న చిత్రాలు పోస్ట్ అయినట్లు తెలుసుకుని బాలియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అమిత్ మౌర్యపై ఐపీసీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు యువతిని వైద్యపరీక్షలకు తరలించి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.