- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రౌండ్‌లో ప్రియుడికి హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన లవర్
దిశ, వెబ్‌డెస్క్ : నేటి సమాజంలో లవ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. టీనేజ్ రాగానే లవర్‌ను మెంటెన్ చేయడం స్టేటస్‌గా మార్చుకున్నారు యువతీయువకులు. లవర్ లేకపోతే ఏదో అపరాదం చేసినట్లు ఫీల్ అయిపోతున్నారు కొందరు టీనేజర్స్. అయితే ప్రేమికులు ఏమాత్రం ఎడబాటు వచ్చినా తట్టుకోలేక పోతున్నారు. అతడి ప్రేమ నాకే సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అబ్బాయిలూ అదే విధంగా ఆలోచిస్తూ ఆమె ప్రేమ దక్కకపోతే దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ అమ్మాయే అబ్బాయిపై దాడికి పాల్పడింది. తనను దూరం పెడుతున్నాడని, సరిగా పట్టించుకోవడం లేదని కోపంతో హగ్గులు, ముద్దులు ఇస్తూ హత్యాయత్నం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు.
22 ఏళ్ల యువతిది పూర్వ బర్ధమాన్ జిల్లాలోని కేసియా గ్రామం. ఆమె అదే గ్రామానికి చెందిన యువకుడితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నది. ఇటీవల ఆమె ఉద్యోగం కోసం ఝార్ఖండ్ వెళ్లి వచ్చింది. అయితే తాను లేని సమయంతో తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో ప్రేమాయణం సాగించి.. తనను దూరం పెట్టాడని అనుమానించింది. దీంతో అతడిపై కోపం పెంచుకున్న ఆమె.. ప్రియుడిని హతమర్చాలని పథకం వేసింది. ఇందులో భాగంగా ప్రియుడికి ఫోన్ చేసి స్థానికంగా ఉన్న సర్కస్ గ్రౌండ్‌కు రావాలని కోరింది.
చాలా రోజుల తర్వాత ప్రియురాలిని కలవబోతున్నానని సంబురపడిన ప్రియుడు సంతోషంగా మైదానానికి వెళ్లాడు. అక్కడికి వచ్చిన యువతి వెంటనే ప్రియుడికి హగ్గులు ఇస్తూ ముద్దుల్లో ముంచెత్తింది. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి సిగరెట్లు తాగారు. ఇదే సమయంలో ప్రియురాలు రివాల్వర్ తీసి ప్రియుడిపై కాల్పులు జరిపింది. ఆ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న బాయ్ ఫ్రెండ్ గట్టిగా అరుస్తూ పరుగు పెట్టాడు. దీంతో స్థానికులు అటువైపు రావడంతో ప్రియురాలు పరారీ అయింది. అయితే బుల్లెట్ అతడి పొత్తికడుపును తాకుతూ వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై సమాచారం అందుకున్న కత్వా పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. యువకుడి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.