- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటర్ అనుకుని శానిటైజర్ తాగిన యువతి
by Shyam |
X
దిశ, మెదక్: తాగు నీరు అనుకుని ఓ యువతి శానిటైజర్ తాగింది.ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. లౌక్‌డౌన్ కారణంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఎదురుగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువతి వాహనాన్ని పోలీసులు ఆపారు. వివరాలు సేకరించిన వారుఆమె బైకును సీజ్ చేశారు. అక్కడే నిలిచిన యువతికి కొద్ది సేపటికే దాహం కావడంతో పక్కనే టేబుల్‌పై పోలీసులు ఉంచిన శానిటైజర్‌ను నీళ్లు అనుకుని పొరపాటున తాగింది. అది గమనించిన ఓ యువకుడు ఆమెనుఅడ్డుకున్నాడు. శానిటైజర్ తాగిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
Tags: corona,lockdown, sanitizer drink, girl, medak
Advertisement
Next Story