- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండాపూర్‌లో తీవ్ర విషాదం.. యువతి ప్రాణం తీసిన ‘మద్యం’
దిశ, వెబ్‌డెస్క్ : భాగ్యనగరం బోనమెత్తిన సమయంలో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం నలుగురు స్నేహితులు వెళ్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనంతటికి మద్యం సేవించి వాహనం నడుపడమే కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. మదినగూడకు చెందిన అభిషేక్ అతని స్నేహితులు సత్యప్రకాష్, తరుణి, అశ్రిత (ఎంటెక్, కెనడా రిటర్న్)తో కలిసి నిన్న సాయంత్రం కొండాపూర్‌లోని స్మార్ట్ పబ్‌కు వెళ్లారు. బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో రెండ్రోజులు వైన్స్, బార్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అయితే, కొండాపూర్‌లోని స్మార్ట్ పబ్ నిర్వాహకులు నిషేధాన్ని విస్మరించి విచ్చలవిడిగా కస్టమర్లకు మద్యం అమ్మినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నలుగురు స్నేహితులు స్మార్ట్ పబ్బులో రసహ్యంగా పార్టీ చేసుకున్నట్లు సమాచారం. కారు డ్రైవింగ్ చేసిన అభిషేక్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వీరంతా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవ శాత్తు కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు డోర్ ఓపెన్ కావడంతో వెనుక సీట్లో కుడివైపు కూర్చున్న అశ్రిత బయటకు పడిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. తరుణి కండిషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్, సత్యప్రకాశ్ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపిన అభిషేక్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మద్యం విక్రయించిన స్మార్ట్ పబ్ మేనేజర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.