- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎత్తులో ‘జిరాఫీ’ గిన్నిస్ రికార్డు
జిరాఫీ ఎత్తుగా ఉంటుందని తెలుసు, కానీ ఎంత ఎత్తు? అసలు మొత్తం జిరాఫీల్లో అత్యంత ఎత్తు ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక జిరాఫీకి గిన్నిస్ బుక్ వాళ్లు రికార్డు ప్రదానం చేశారు. అది కూడా ఎత్తు విషయంలోనే. అంటే భూమ్మీద ఉన్న జిరాఫీల్లో అన్నింటికన్నా ఈ జిరాఫీ ఎక్కువ ఎత్తుగా ఉందని వారు గుర్తించారు. ఇంతకీ దీని ఎత్తు ఎంతో తెలుసా? 18 అడుగుల 8 అంగుళాలు. ఈ జిరాఫీ వయస్సు 12 ఏళ్లు. క్వీన్స్‌ల్యాండ్‌లోని ఆస్ట్రేలియన్ జూలో ఈ జిరాఫీని అత్యంత ఎత్తయిన జిరాఫీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
ప్రముఖ జూ కీపర్ స్టీవ్ ఇర్విన్ కూతురు బిందీ ఇర్విన్ ఈ విషయాన్ని గిన్నిస్ వాళ్లకు వెల్లడించింది. వాళ్లు వచ్చి సరిచూసుకుని ఈ జిరాఫీకి రికార్డును బహుకరించారు. ప్రతి ఏడాది ఏడు లక్షలకు పైగా సందర్శకులు వచ్చే ఈ జూలో ఇప్పుడు ఈ జిరాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంతకీ ఈ జిరాఫీ పేరు చెప్పలేదు కదూ.. దీని పేరు ఫారెస్ట్. 2007లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ జూలో పుట్టింది. రెండేళ్ల క్రితం క్వీన్స్‌ల్యాండ్ జూకి తీసుకొచ్చారు. ఈ జూలో ఉన్న జిరాఫీ గుంపులో ఇదొక్కటే మగ జిరాఫీ. ఇదిలా ఉండగా ఈ జిరాఫీ ఎత్తును కొలవడానికి గిన్నిస్ బుక్ సిబ్బంది స్తంభాలను ఉపయోగించారంటే దీని ఎత్తు ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు.