జిల్లెట్ ఇండియా మొత్తం ఆదాయం రూ. 353 కోట్లు !

by Harish |
జిల్లెట్ ఇండియా మొత్తం ఆదాయం రూ. 353 కోట్లు !
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరాని(Financial year)కి జూన్‌తో ముగిసిన త్రైమాసికం (Quarterly)లో జిల్లెట్ ఇండియా(Gillette India) నికర లాభం(Net profit) 1.85 శాతం తగ్గి రూ. 44.97 కోట్లకు చేరుకుంది. జిల్లెట్ ఇండియా జులై నుంచి జూన్‌కి ఆర్థిక సంవత్సరాన్ని లెక్కిస్తుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 45.82 కోట్లను వసూలు చేసింది. నాలుగో త్రైమాసికంలో జిల్లెట్ ఇండియా మొత్తం ఆదాయం 24.36 శాతం తగ్గి రూ. 352.74 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 466.39 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing‌)లో వెల్లడించింది. ఏప్రిల్ నుంచి మేలో కరోనా వైరస్(Corona virus) వ్యాప్తి, లాక్‌డౌన్ (Lockdown) కారణంగా అమ్మకాలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. దీనివల్ల వినియోగదారుల నుంచి డిమాండ్ క్షీణించినట్టు జిల్లెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ గోపాలన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed