జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు

by  |
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. రూ.6కోట్ల వ్యయంతో తార్నాక లాలాపేట వార్డులోని వాలీబాల్ కోర్టు ప్రాంగణంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, రూ.41కోట్లతో ఖైరతాబాద్ జోన్ పరిధిలో 13థీమ్ పార్కుల అభివృద్ధి, రూ.2.98కోట్లతో పటాన్‌చెరు రామచంద్రపురంలో రైతుబజార్ ఏర్పాటు, రూ.4.60 కోట్లతో దనియాలగుట్ట బేగంపేట హిందూ శ్మశానవాటిక ఆధునీకరణ పనులు, ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు నుండి ఖాజాగూడ చెరువు వయా ఉర్దు యూనివర్సిటీ వరకు 30మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించే మార్గంలో ఉన్న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ స్థలాన్ని సేకరించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

హైటెక్‌సిటీ ఫేజ్-2నుండి గచ్చిబౌలి ఇనార్బిట్‌రోడ్ వరకు 12మీటర్ల రోడ్డు వెడల్పు పనులు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుండి జీఎస్ఎం మాల్ మియాపూర్ మెయిన్‌రోడ్ వరకు 60 మీటర్ల రోడ్డు విస్తరణ, స్పోర్ట్స్, ప్లే మెటీరియల్ కొనుగోలుకు ప్రతీవార్డుకు రూ. లక్ష నుండి రూ.2లక్షలకు పెంపు, ప్రతిభ కనబర్చిన పూర్వ క్రీడాకారులకు పింఛను, ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్బీనగర్ నుండి బైరామల్‌గూడ జంక్షన్ వరకు 60మీటర్ల వెడల్పు పనుల కారణంగా ఆస్తులు కోల్పోతున్న ఇద్దరు యజమానులకు నష్టపరిహారం, వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి జీహెచ్ఎంసీతో పాటు ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్‌‌కు ఆహ్వానం, విశ్రాంత ఉద్యోగి మహ్మద్‌గౌస్ మొయినుద్దీన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సేవలు ఏడాది పాటు వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.


Next Story

Most Viewed