- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ ఈవీడీఎం అక్కసు.. ‘ఎల్లో జర్నలిజం‘ అంటూ ఫ్రస్ట్రేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. మీడియాలో వార్తలు వస్తే ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ‘ఎల్లో జర్నలిజం‘ అంటూ ముద్ర వేస్తున్నారు. జర్నలిజానికి రంగులు పూస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలకు తనదైన శైలిలో నిర్వచనాలు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు చేసే తరహాలో ‘ఎల్లో జర్నలిజం‘ అంటూ విశ్లేషణాలను జోడిస్తున్నారు. ‘దిశ‘ పత్రికలో వార్త ప్రచురితమైన మరుసటి రోజు ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన వ్యాఖ్యలు ఆయన తీరుకు అద్దం పడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్‌లు, నోటీసులపై చర్యలు తీసుకునే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదనే ఆరోపణలను దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీల హోర్డింగులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చర్యలు తీసుకోడానికి వెనకాడే డైరెక్టర్ ‘టు లెట్‘ లాంటి చిన్నా చితకా పోస్టర్ల విషయంలో మాత్రం జరిమానాను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లోనే ఆయనపై విమర్శల వర్షం కురుస్తున్నది. ‘దిశ‘ పత్రిక కూడా ‘టు లెట్‘ అనే పోస్టర్‌కు రూ. 2,000 జరిమానా విధించినట్లు వార్తను ప్రచురించింది. ఇంటి ఆవరణ పరిధిని దాటి పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి నోటీసులు పెడితే ఫైన్ కట్టక తప్పదని ఆ వార్తలో స్పష్టం చేసింది.
ఈ విషయానికి క్లారిటీ ఇచ్చే క్రమంలో ‘ఎల్లో జర్నలిజం‘ అంటూ ఒక అన్వయాన్ని జోడించడం చర్చనీయాంశమైంది. ప్రచురితమైన వార్తలో పబ్లిక్ ప్లేస్‌గా ఉండే ‘చౌరస్తా‘ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ పోస్టులో నొక్కిచెప్పారు. సొంత స్థలంలో అలాంటి పోస్టర్లు పెట్టుకుంటే ఇబ్బంది లేదని, పరిధిని దాటితే మాత్రమే జరిమానా అని పేర్కొన్నారు. ‘దిశ‘ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తప్పుపట్టడానికి ఆస్కారం లేకపోవడంతో ‘ఎల్లో జర్నలిజం‘ అనే రాగమందుకున్నారు.
Certain yellow journalistic articles are on circulation claiming that @CEC_EVDM is levying penalties on To-Let boards of individuals. It is clarify that To-Let boards on the concerned property are not liable to be penalized 1/2 pic.twitter.com/hF5KlKzvLu
— Director EV&DM, GHMC (@Director_EVDM) August 20, 2021
- Tags
- GHMC
- journalisam