- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ అలర్ట్.. ఎమర్జెన్సీ బృందాలు రెడీ..!
దిశ, సిటీ బ్యూరో: ఈ సారి వర్షాకాలం కాస్త ముందుగానే రానుంది. పైగా గతంలో కన్నా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, ఇటీవల నగరంలో కురిసిన వర్షాలతో ఎట్టకేలకు మహానగర పాలక సంస్థ అప్రమత్తమైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని మరోసారి అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి, ఏదైన ఘటన జరిగినపుడు మాత్రమే హడావుడి చేసే జీహెచ్ఎంసీ అధికారులు ఈ సారి కాస్త లేటు అయినా ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశామని చెబుతున్నారు.
నగరంలోని ఆరు జోన్లలో సుమారు రూ. 32 కోట్ల వ్యయంతో బృందాలు, వాహనాలు, యంత్రాలను సిద్ధం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో డిజాస్టర్ బృందాలను కూడా రెడీ చేశామని తెలిపారు. ఆరు జోన్లలో గతంలో వర్షాలు కురిసి ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాల్లో ఈ సారి నష్టాన్ని తగ్గించేందుకు ఎక్కువ బృందాలను అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగా అన్ని జోన్ల కన్నా ఎక్కువగా సుమారు రూ. 7,45 కోట్లతో ఖైరతాబాద్ జోన్‌లో కార్యచరణకు సిద్ధం చేశారు.
చార్మినార్ జోన్‌లో కనిష్టంగా రూ.4.39 కోట్లతో వానాకాలం బృందాలు, వాహనాలు, యంత్రాలను సమకూర్చుకున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా మొత్తం 139 స్టాటిక్ లేబర్ టీమ్స్, 128 మినీ మొబైల్ బృందాలు, 114 వాహానాలు, మొబైల్ ఎమర్జన్సీ బృందాలు, 67 అత్యంత అత్యవసర బృందాలు, మొత్తం 78 వాహనాలతో కలిపి 32 కోట్ల 96 లక్షల 18 వేల ఖర్చుతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఎంత ఘనమైన ఏర్పాట్లు చేసుకున్నా, అధికారుల విధి నిర్వహణలో చిత్తశుద్ధి, ఎమర్జెన్సీ బృందాల సమమస్ఫూర్తి లేనిదే ఫలితం ఉండదు.
జోన్ల వారీగా బృందాలు, ఏర్పాట్ల వివరాలు
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ జోన్‌లో రూ.48.9 లక్షల వ్యయంతో 15 స్టాటిక్ లేబర్ టీమ్‌లు, 33 మినీ మొబైల్ టీమ్స్, రూ.3.85 కోట్లతో 27 వాహనాలు, 15 మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ ప్లస్ 15 వాహనాలు, రూ.89.5 లక్షల వ్యయంతో మరో 9 వాహనాలను అందుబాటులో ఉంచారు. చార్మినార్ జోన్ పరిధిలో రూ. 17.4 లక్షలతో 5 స్టాటిక్ లేబర్ టీమ్స్, రూ. 2.58 కోట్ల వ్యయంతో 25 మినీ మొబైల్ టీమ్స్ ప్లస్ 25 వాహనాలు, కోటి 64 లక్షలతో 13 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు, వాహనాలను సమకూర్చుకున్నారు.
అలాగే ఖైరతాబాద్ జోన్ పరిధిలో రూ. 2.97 కోట్ల వ్యయంతో 56 స్టాటిక్ లేబర్ బృందాలు, 24 మినీ మొబైల్ టీమ్స్, 41 లక్షలతో 25 వాహనాలు, రూ. 57.6 లక్షల వ్యయంతో మూడు వాహనాల్లో మూడు ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక శేరిలింగంపల్లి జోన్‌లో రూ.2.57 కోట్ల వ్యయంతో 58 స్టాటిక్ లేబర్ బృందాలు, రూ.2,46 కోట్లతో 12 వాహనాల్లో 20 మొబైల్ టీమ్స్, మరో రూ. 83.6 లక్షల వ్యయంతో 16 వాహనాల్లో మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను సిద్ధం చేశారు.
కూకట్‌పల్లి జోన్‌లో రూ.14,7 లక్షల వ్యయంతో ఏడు స్టాటిక్ లేబర్ బృందాలు, కోటి రూపాయల వ్యయంతో 9 వాహనాల్లో 9 మినీ మొబైల్ టీమ్స్, మరో రూ.83 లక్షలతో 16 వాహనాలు, ఐదు మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ జోన్‌లో రూ.14లక్షలతో ఆరు స్టాటిక్ లేబర్ బృందాలు, రూ.2,99 కోట్ల వ్యయంతో 17 వాహనాల్లో 17 మినీ మొబైల్ టీమ్స్, మరో రూ. 2.36 కోట్లతో 13 వాహనాలతో 13 ఎమర్జెన్సీ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.