- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరికొత్త ఆడి ఇండియా ఏ4 విడుదల!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లోకి తన సరికొత్త ఏ4 సిరీస్ మోడల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఐదో తరం ఆడి ఏ4 సెడాన్ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ కారు డిజైన్, ఇంటీరియర్స్, ఫీచర్లను అప్‌డేట్ చేసినట్టు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త ఏడీ4 సెడాన్ ప్రీమియం ప్లస్, టెక్నాలజీ వేరియంట్‌లుగా రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 42.34 లక్షలు(ఎక్స్‌షోరూమ్), రూ. 46.67 లక్షలు(ఎక్స్‌షోరూమ్)లతో లభించనున్నాయి. మెరుగైన పనితీరుతో పాటు సమర్థవంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది. గంటకు 241 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న ఈ కారు కేవలం 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది.
కీ-లెస్ ఎంట్రీతో పాటు పవర్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీటుకి మెమొరీ ఫీచర్ లాంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నట్టు పేర్కొంది. కారులో ఉన్న 12వీ హైబ్రిడ్ వ్యవస్థ ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చని, బెల్ట్ ఆల్టర్నేటర్ స్టార్టర్ అనే కొత్త టెక్నాలజీని ఈ కారులో అందిస్తున్నట్టు ఆడి వెల్లడించింది. ‘ కొత్త ఏడాదిని ఆడి ఏ4 మోడల్‌తో ప్రారంభించడం సంతోషంగా ఉంది. నూతన ఫీచర్లతో కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వనున్నాం. 2021లో ఇంకా కొత్త మోడళ్లను తీసుకొస్తామని’ ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ చెప్పారు.