- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రితేష్.. ఆ గౌరవం ఇచ్చినందుకు థాంక్స్ : జెనీలియా
దిశ, వెబ్‌డెస్క్ : హా..హా.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధమైన జెనీలియా.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. కాగా జెనీలియా భర్తగా చెప్పుకునేందుకు తాను గర్వంగా ఫీల్ అవుతున్నట్లు రితేష్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంతకీ ఏం జరిగింది? అంత గర్వపడే పని జెనీలియా ఏం చేసి ఉంటుంది ? అనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం.. ఓ సారి బెంగళూరులో మ్యాచ్ చూసేందుకు వెళ్లిన రితేష్‌ను చూసి, ఇద్దరు క్రికెటర్లు మీరు జెనీలియా భర్త కదా అని అడిగారట. దీంతో మండిపోయిన రితేష్.. నేను జెనీలియా భర్త ఏంటి? తనే నా భార్య.. మహారాష్ట్రకు వచ్చి చూడు.. తననే రితేష్ భార్య అని పిలుస్తారు అన్నాడట. దాంతో ఆ ఇద్దరు క్రికెటర్లు ఒక్క మహారాష్ట్రలోనే అలా పిలుస్తారు.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా చాలా ప్రాంతాల్లో నువ్వు జెనీలియా భర్తగానే పరిగణించబడుతావు అన్నారట. ఈ సంఘటనను గురించి కపిల్ శర్మ షోలో తెలిపిన రితేష్.. నేను జెనీలియా భర్తగా పరిగణించబడుతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జెనీలియా.. చాలా సంతోషపడింది. ప్రతీ స్త్రీ కూడా పురుషుడితో సమానంగా గుర్తింపు పొందేందుకు పోరాటం చేస్తూనే ఉంటుందని.. కానీ ఏం అడగకుండానే నాకు ఆ గౌరవం దక్కిందని తెలిపింది.