సిగ్గులేదా.. వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జెనీలియా

by Anukaran |   ( Updated:2021-09-29 22:43:29.0  )
సిగ్గులేదా.. వల్గర్ ఆంటీ అంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జెనీలియా
X

దిశ, వెబ్‌డెస్క్: హహ.. హాసిని అంటూ తెలుగు కుర్రకారు మతులు పోగొట్టిన హీరోయిన్ జెనీలియా. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. సినిమాలకు దూరమైనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్ల పై ట్రోలింగ్ ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తాజాగా ఈ పరిస్థితిని జెనీలియా ఎదుర్కొంది.

ఇటీవల జెనీలియా మరియు రితేష్ దేశ్ ముఖ్ లు కలిసి నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న పించ్ టాక్ షో లో పాల్గొన్నారు. ఈ షోలో సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి వచ్చే ట్రోల్స్ మరియు కామెంట్స్ ను అర్బాజ్ ఖాన్ చర్చించడం జరుగుతుంది. ఎప్పుడు స్పందించని విషయాలకు కూడా సెలబ్రెటీలు అర్బాజ్ ఖాన్ షో లో స్పందిస్తారు. ఇక రితేష్- జెనీలియాకు సంబంధించిన ఒక వీడియో పై ఒక నెటిజన్ చేసిన వల్గర్ కామెంట్ ని అర్బాజ్ ఖాన్ చూపించాడు.

https://www.youtube.com/watch?v=tJBcvr6zbB0

వీడియోలో భాగంగా జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా ఎదురుగానే ప్రీతిజింతా చేతులను తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. అది చూసిన జెనీలియా ఎంతో జలసీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా తన భర్తని కొడుతుంటే తను వద్దు అంటూ ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ “సిగ్గు లేదా వల్గర్ ఆంటీ.. ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటావు. అది నీ మొహానికి అస్సలు సూట్ అవ్వదు” అంటూ కామెంట్స్ పెట్టాడు. ఇక దీనిపై జెనీలియా స్పందిస్తూ ” పాపం అతని ఇంట్లో పరిస్థితులు బాలేదేమో.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ జాన్ మీ ఇంట్లో అంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను” అంటూ అతడి గూబ పగిలి పోయింతగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Next Story