కరోనాపై పోరాటానికి గవాస్కర్ రూ. 59 లక్షల విరాళం

by vinod kumar |
కరోనాపై పోరాటానికి గవాస్కర్ రూ. 59 లక్షల విరాళం
X

కరోనాపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములై, ఎవరికి తోచిన సాయం వారు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో సామాన్యుల నుంచి బిలియనీర్ల వరకు తమ స్థాయికి తగ్గట్టుగా ‘పీఎం కేర్స్ ఫండ్‌’కు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గవాస్కర్ రూ. 59 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ. 35 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 24 లక్షలు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. ఈ మేరకు ముంబై రంజీ మాజీ ప్లేయర్ అన్మోల్ ట్వీట్ చేశారు.

పుజారా గుప్త దానం..

టీమ్ ఇండియా టెస్టు ప్లేయర్ చతేశ్వర్ పుజారా సైతం పీఎం కేర్స్ ఫండ్‌కు తన వంతుగా విరాళం అందించారు. అయితే ఎంత మొత్తం ఇచ్చింది బయటకు చెప్పలేదు. ‘నేను, నా కుటుంబం కలిసి కొంత మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్, గుజరాత్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపించాం. మీరు కూడా మీ చేతనైన సాయం చేయండి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎంత చిన్న మొత్తమైనా పెద్ద సాయమే, ఇది మనమందరం ఒకటే అనే భావనను పెంచుతుంది’ అని పుజారా చెప్పాడు. కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు తన కృతజ్ఞతలు తెలిపాడు.

Tags : Corona, Donation, Sunil Gavaskar, Chateswar Pujara, PM cares fund

Advertisement

Next Story

Most Viewed